రాజమౌళి కొడుకు పెళ్లిలో స్టార్స్ హంగామా..!

రాజమౌళి తనయుడి పెళ్లిలో స్టార్ హంగామా ఓ రేంజ్ లో ఉంది. జైపూర్ లో ఓ స్టార్ హోటల్ లో కార్తికేయ పెళ్లి జరుగుతుంది. ప్రభాస్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, రానా, నాని ఇలా అందరు పెళ్లి సందడిలో పాల్గొన్నారు. స్టార్స్ అంతా ఒక చోట చేరితే ఆ హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే. ఆటలు పాటలు సరదా సరదాగా ఈ పెళ్లి వేడుక జరుగుతుంది. 


ముఖ్యంగా కీరవాణి వ్యాఖ్యాతగా జరిగిన ఓ ప్రోగ్రాం తాలూఖా వీడియో బయటకు వచ్చింది. అంతేకాదు ఎన్.టి.ఆర్, చరణ్, ప్రభాస్, రానా డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్స్ లో కేవలం బన్ని, మహేష్ తప్ప మిగతా వారంతా కార్తికేయ పెళ్లి వేడుకలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. రేపు అనగా డిసెంబర్ 30న కార్తికేయ మ్యారేజ్ జరుగనుంది. 

త్వరలోనే హైదరాబాద్ లో రిస్పెషన్ ఏర్పాట్లు చేస్తారట. పెళ్లికే ఇంత హడావిడి ఉంటే హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు సినిమా పరిశ్రమ మొత్తం వచ్చే అవకాశం ఉంది.