
ధ్రువకు ముందు దాకా చరణ్ కెరియర్ కాస్త అయోమయంలో ఉండగా ధ్రువతో హిట్ అందుకున్న చెర్రి ఆ తర్వాత రంగస్థలం సినిమాతో సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమా చరణ్ స్టామినా లెక్క ఎంతో తేల్చింది. ప్రస్తుతం వినయ విధేయ రామ అంటూ సంక్రాంతికి మరో క్రేజీ మూవీతో వస్తున్నాడు చరణ్. బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న వివిఆర్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది.
ఇక ఈ సినిమా హిట్ కొడితే డబుల్ హ్యాట్రిక్ సాధించినట్టు అవుతుంది. అదేంటి ఒకవేళ హిట్ అయితే ధ్రువ, రంగస్థలంలతో పాటుగా ఈ సినిమా కలిపి హ్యాట్రిక్ మాత్రమే కదా అనుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చరణ్ సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన సినిమాలు ఆల్రెడీ రెండు ఉన్నాయి. అందులో ఒకటి నాయక్ కాగా మరోటి ఎవడు. నాయక్ వినాయక్ డైరక్షన్ లో వచ్చింది. ఎవడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వచ్చి హిట్ అందుకుంది. సో వివిఆర్ హిట్ చరణ్ కు డబుల్ హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి.