
సూపర్ స్టార్ రజినికాంత్, కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న సినిమా పెట్ట. సన్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. ట్రైలర్ లో రజిని మార్క్ స్టైల్ అదిరిపోయిందని చెప్పొచ్చు. రజినికి వీరాభిమాని అయిన కార్తిక్ ఎలా చూపిస్తే ఫ్యాన్స్ ఉత్సాహపడతారో అలానే పెట్టలో రజినిని చూపించాడు. రజిని స్టైల్, యాక్షన్, డైలాగ్స్ పెట్ట రజిని ఫ్యాన్స్ కోరిక తీర్చే అసలు సిసలు సినిమాగా వస్తుంది.
సినిమాలో రజిని సరసన సిమ్రాన్, త్రిష నటించడం జరిగింది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు. సి. కళ్యాణ్ పెట్ట తెలుగు రైట్స్ దక్కించుకున్నారని తెలుస్తుంది. సినిమాలో కోలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ సేతుపతి కూడా అదరగొట్టాడు. సినిమాలో అతను విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.