పెళ్లిచూపులు డైరక్టర్.. హీరో ప్రయత్నాలు..!

పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ తరుణ్ భాస్కర్ ఆ సినిమాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. యూఎస్ లో పెళ్లిచూపులు మూవీ భారీ వసూళ్లను తెచ్చింది. ఇక ఆ తర్వాత ఈనగరానికి ఏమైంది సినిమా చేశాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఇదిలాఉంటే ఈ డైరక్టర్ కు నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని ఉందట. ఇప్పటికే మహానటిలో సింగీతం శ్రీనివాస్ రావుగా కనిపంచాడు తరుణ్ భాస్కర్.

సమ్మోహనం సినిమాలో కూడా కెమియో రోల్ చేశాడు. ఇక ఈనగరానికి ఏమైంది హీరో విశ్వక్సేన్ డైరెక్ట్ చేస్తున్న ఫలక్ నుమా దాస్ సినిమాలో కూడా తరుణ్ భాస్కర్ నటిస్తున్నాడట. ఇక విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేస్తున్న సినిమాలో ఏకంగా తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తున్నడని అంటున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తాడట. మరి తరుణ్ భాస్కర్ కు ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.