అఖిల్ మిస్టర్ మజ్ను రీమేకా..!

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మిస్టర్ మజ్ను. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కొద్దిరోజుల క్రితం రిలీజైన ఈ సినిమా టీజర్ సినిమాపై ఆసక్తి పెంచింది. అయితే టీజర్ చూసిన వారికి ఇదో రీమేక్ సినిమా అనిపించింది. ఇక ఇప్పుడు సినిమాలో రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వాటిని చూసి ఇది కచ్చితంగా హింది సినిమా రీమేక్ అనేస్తున్నారు.

బాలీవుడ్ లో బచ్నా హే హసీనా సినిమాకు మిస్టర్ మజ్ను రీమేక్ అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. సినిమాలో రణ్ బీర్, దీపికా పదుకునే, బిపాసా బసు నటించారు. అందులో హీరో ఓ ప్లే బాయ్ మిస్టర్ మజ్ నులో కూడా అఖిల్ ప్లే బోయ్ గా కనిపిస్తున్నాడు. మరి నిజంగానే రీమేక్ చేస్తున్నారా లేక ఫ్రీమేక్ చేశారా అన్నది సినిమా చూస్తేనే కాని తెలియదు. ఈ సినిమాను 2019 జనవరి 25న రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు.