
మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ వినయ విధేయ రామ. సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగబోతుంది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమా ఆడియో జ్యూక్ బాక్స్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు.
చరణ్, దేవి మ్యాజిక్ రిపీట్ చేసేలా ఈ సాంగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మెలోడీ, రొమాన్స్, పెప్పీ ఇలా అన్ని విభాగాల్లో వినయ విధేయ రామ సాంగ్స్ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని తెలుస్తుంది. అయితే స్పెషల్ గెస్టులుగా ఎన్.టి.ఆర్, రాజమౌళి కూడా వస్తారని టాక్. సంక్రాంతి కానుకగా జనవరి 11న వినయ విధేయ రామ రిలీజ్ ఫిక్స్ చేశారు.