
మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ తో హిట్ అందుకున్నా ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలు అపజయపాలయ్యాయి. ఫ్లాపులు రవితేజలో మార్పు తీసుకొచ్చాయి. ఎంతగా అంటే రెమ్యునరేషన్ పరంగా వెనక్కి తగ్గేంతటి మార్పులు అన్నమాట. ప్రస్తుతం నేల టికెట్టు నిర్మాత రాం తాళ్లూరి నిర్మాణంలో ఎస్.ఆర్.టి మూవీస్ బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు రవితేజ.
వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు రవితేజ రెమ్యునరేషన్ 5 కోట్లు తీసుకుంటున్నాడట. రాజా ది గ్రేట్ హిట్ తర్వాత సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేస్తున్న రవితేజ రెండు ఫ్లాపులతో మళ్లీ కెరియర్ వెనక్కి తగ్గాడు. అందుకే చేయబోతున్న సినిమాకు పారితోషికం తగ్గించాడట. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న వి.ఐ ఆనంద్ ఒక్క క్షణం అంచనాలను అందుకోకున్నా రవితేజ సినిమా మాత్రం హిట్ టార్గెట్ తో చేస్తున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.