
కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక కెరియర్ లో వెనుకపడి ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ మెహబూబా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుందని తెలుస్తుంది. పూరి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రామ్ ఈ సినిమా కోసం మేకోవర్ కు సిద్ధమవుతున్నాడు.
పూరి తో రామ్ కచ్చితంగా ఇదో క్రేజా కాంబినేషన్. రామ్ కూడా ఈమధ్య లవ్, ఫ్యామిలీ సినిమాలు చేస్తూ వచ్చాడు. పూరి సినిమాతో మరోసారి తనలోని మాస్ యాంగిల్ చూపించేందుకు సిద్ధమయ్యాడు రాం. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి ఈసారి రామ్ తో కూడా కచ్చితంగా అదరగొట్టే సినిమా చేస్తాడని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.