ట్రిపుల్ రోల్ లో బాలయ్య..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ నాడే తన తర్వాత సినిమా ఎనౌన్స్ చేశాడు నందమూరి బాలకృష్ణ. సింహా, లెజెండ్ సినిమాలతో హిట్ కొట్టిన బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బాలయ్య తర్వాత సినిమా ఉంటుందట. ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా గురించి ఓ స్పెషల్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో బాలయ్య ఒకటి రెండు కాదు ఏకంగా 3 పాత్రల్లో కనిపిస్తాడట.

అంటే బాలయ్య మరోసారి ట్రిపుల్ రోల్ చేస్తున్నాడన్నమాట. కెరియర్ లో కాస్త వెనుకపడినట్టు అనిపించిన టైంలో సిం హా రూపంలో సూపర్ హిట్ ఇచ్చి బాలకృష్ణ కెరియర్ మళ్లీ ఊపందుకునేలా చేసిన బోయపాటి ఈసారి అలాంటి క్రేజీ సబ్జెక్ట్ తోనే వస్తున్నాడట. బాలకృష్ణ అధినాయకుడులో ట్రిపుల్ రోల్ చేశాడు. మళ్లీ మరోసారి బోయపాటి డైరక్షన్ లో మూడు పాత్రల్లో నటిస్తున్నారు. మరి సింహా, లెజెండ్ ఈ రెండు సినిమాలను మించి రాబోతున్న ఈ సినిమా ఉంటుందని నమ్ముతున్నారు నందమూరి ఫ్యాన్స్.