పరశురాంతో బన్ని.. ఫిక్స్ అయిపోవచ్చు..!

నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే సినిమా మీద భారీ చర్చలు నడుస్తున్నాయి. కొద్దిసేపు త్రివిక్రం సినిమా ఇవాళో రేపో ఓపెనింగ్ అనేస్తుంటే మరో పక్క త్రివిక్రం కథకు బన్ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు. ఇక ఇప్పుడు బన్ని తర్వాత సినిమా త్రివిక్రంతో కాదు పరశురాంతో చేస్తున్నాడని అంటున్నారు. గీతా గోవిందం సినిమా సూపర్ హిట్ అయినా పరశురాం ఇంకా తన తర్వాత సినిమా ఎనౌన్స్ చేయలేదు.

ఈమధ్యనే తను రాసిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ బన్నికి వినిపించాడట. స్టోరీ నచ్చడంతో అల్లు అర్జున్ దానికి లాక్ అయ్యాడని అంటున్నారు. బన్ని, పరశురాం కొన్నాళ్లుగా మీడియాలో నలుగుతున్న ఈ కాంబినేషన్ ఫైనల్ గా సెట్ అయ్యింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. న్యూ ఇయర్ రోజు ఈ సినిమాకు సంబందించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.