లవర్స్ డే వస్తున్న ప్రియా ప్రకాశ్..!

కన్నుగీటి కుర్రాళ్ల గుండెళ్లో గిలిగింతలు పెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది మళయాళ భామ ప్రియా ప్రకాశ్. ఒరు ఆదార్ లవ్ సినిమాతో ఓ సాంగ్ టీజర్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ప్రియా ఒక సినిమా రిలీజ్ కాకుండానే సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అయితే ఒరు ఆదార్ లవ్ సినిమా ఇంకా రిలీజ్ అవలేదు. ఆ సినిమాకు ఏర్పడిన క్రేజ్ చూసి ఆ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.  

తెలుగులో లవర్స్ డే టైటిల్ తో ఈ మూవీ వస్తుందట. ఇక ఈ సినిమాను సరిగ్గా ప్రేమికుల రోజు రిలీజ్ చేస్తున్నారట. ఫిబ్రవరి 14న మళయాళంలో ఒరు ఆదర్ లవ్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే అదే డేట్ కు ఆ మూవీని ఇక్కడ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఫస్ట్ కాపీ సిద్ధం కాగానే ఇక్కడ డబ్బింగ్ ఏర్పాట్లు చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి ప్రియా తన తొలి సినిమాతోనే తెలుగు, మళయాళ భాషల్లో సత్తా చాటబోతుంది.