ఎన్టీఆర్ ఆడియో.. చిరంజీవి, రాజమౌళి మిస్సింగ్..!

శుక్రవారం జరిగిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఆడియో వేడుకలో నందమూరి ఫ్యామిలీతో పాటుగా సిని పరిశ్రమకు సంబందించిన పెద్దలు కూడా అటెండ్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, జమున, గీతాంజలి వారందరు పెద్దాయన మీద ఉన్న అభిమానం ప్రేమతో ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆడియోకి వచ్చారు. ఇక ఎటొచ్చి రానిదల్లా మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి.  

కొన్నాళ్లుగా మెగా నందమూరి కుటుంబాల మధ్య రాజకీయ కలహాలు ఎక్కువయ్యాయి. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా రాని గొడవలు పవన్ కళ్యాణ్ జనసేన వల్ల వస్తున్నాయి. ఈ కారణం చేత మెగా, నందమూరి హీరోల మధ్య సన్నిటి పొర ఏర్పడింది. అయితే ఇవన్ని పక్కన పెట్టి చిరంజీవికి కాల్ చేశాడట బాలకృష్ణ. అయితే తాను సైరా సినిమా షూటింగ్ లో ఉన్నానని చెప్పాడట.  

ఇక ఈ వేడుకలో రాజమౌళి కనిపించకపోవడం కూడా ఆశ్చర్యంగా అనిపించింది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి అలాంటి రాజమౌళికి బాలకృష్ణ ఆహ్వానం పంపించలేదా అంటే అతని కొడుకు కార్తికేయ పెళ్లి హడావిడిలో ఉండి రాలేకపోయాడని అని అంటున్నారు. కారణం అదేనా లేక మరేదైనా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.