
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని కొద్ది గ్యాప్ ఇచ్చారు. సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో మొదలవనుందని తెలుస్తుంది. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తాడని తెలుస్తుండగా.. చరణ్ మాత్రం పోలీస్ గా కనిపిస్తాడట.
ఇక ఈ మూవీలో ఇద్దరు స్టార్స్ కు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ను వెతికే పనిలో పడ్డాడు జక్కన్న. కీర్తి సురేష్, కియరా అద్వానిల పేర్లు వినిపించినా కీర్తి సురేష్ కొత్తగా రజినికాంత్ సినిమా ఓకే చేయడం చూస్తుంటే ట్రిపుల్ ఆర్ లో ఛాన్స్ లేదన్నట్టే తెలుస్తుంది. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం తెలుగు అమ్మాయి అదితి రావు హైదరికి ఆర్.ఆర్.ఆర్ లో ఛాన్స్ దక్కిందని అంటున్నారు. హీరోయిన్ గా ప్రత్యేకమైన సినిమాలు చేస్తున్న అదితి రావు హైదరి శుక్రవారం రిలీజైన అంతరిక్షం మూవీలో కూడా మంచి నటన కనబరచింది. ట్రిపుల్ ఆర్ లో అదితి రావు ఉంటుందని అంటున్నారు. మరి అఫిషియల్ గా చెప్పేదాకా వెయిట్ చేయాల్సిందే.