
వైఎస్సార్ బయోపిక్ గా వస్తున్న యాత్ర సినిమా నుండి ఓ సర్ ప్రైజ్ టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రజల కష్టాలను తీర్చే ప్రజానాయకుడిగా పాదయాత్రతో వారి బాధలను కళ్లారా చూసిన జననేతకు ఎదురైన అనుభవాలు.. అందిన నీరాజనాలు.. వై.ఎస్.ఆర్ యాత్రలో చూపిస్తున్నారు. ముఖ్యంగా రైతుల కష్టాలను విని చలించిన రాజన్న వారి క్షేమమే ముఖ్య ఉద్దేశంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
టీజర్ లో చివరగా నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ అభయ హస్తం ఇస్తూ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. వైఎస్ జీవిత చరిత్రగా వస్తున్న ఈ యాత్ర వైఎస్సార్ అభిమానులకు పెద్ద కానుక అవుతుందని చెప్పొచ్చు. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్ల, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా యాత్ర మూవీ రిలీజ్ కానుంది.