రజినికి జోడీగా మహానటి..!

సూపర్ స్టార్ రజినికాంత్ పెట్ట సినిమా తర్వాత మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా చేస్తాడని కోలీవుడ్ టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో మొదలు కానుందట. రజిని కోసం ఓ అదిరిపోయే పొలిటికల్ థ్రిల్లర్ కథ సిద్ధం చేశాడట మురుగదాస్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మహానటి సినిమాతో ఆమె నటిగా మరింత ప్రేక్షకులకు దగ్గరైంది.

ఇప్పుడు రజినికి జోడీగా నటించే ఛాన్స్ దక్కించుకుంది. రీసెంట్ గా విజయ్ సర్కార్ సినిమాలో నటించిన కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పుడు రజినితో ఛాన్స్ అందుకున్న అమ్మడి ఆనందానికి అవధుల్లేవని చెప్పొచ్చు. మళయాళ భామే అయినా తెలుగు, తమిళ భాషల్లోనే అమ్మడు సూపర్ ఫాంలో కెరియర్ దూసుకెళ్తుంది.