
బయోపిక్ సినిమాల హవా నడుస్తున్న టాలీవుడ్ లో ప్రస్తుతం సెట్స్ మీద ఎన్.టి.ఆర్ బయోపిక్ తో పాటుగా వై.ఎస్.ఆర్ బయోపిక్ కూడా తెరకెక్కుతుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ క్రిష్ డైరక్షన్ లో బాలకృష్ణ లీడ్ రోల్ లో వస్తుంది. అయితే ఈ మూవీ రెండు పార్టులుగా వస్తుందని తెలుస్తుంది. జనవరి 9అ ఎన్.టి.ఆర్ కథానాయకుడు రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక సెకండ్ పార్ట్ ముందు జనవరి 24న అనుకున్నా మొదటి పార్ట్ కు రెండో పార్ట్ కు కనీసం నెల రోజులైనా గ్యాప్ ఉండాలని ఫిబ్రవరి 7కి మహానాయకుడు రిలీజ్ ఫైనల్ చేశారు.
అయితే సర్ ప్రైజ్ ఏంటంటే వై.ఎస్ బయోపిక్ గా వస్తున్న యాత్ర మూవీ కూడా ఫిబ్రవరి 8న రిలీజ్ ప్లాన్ చేశారు. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి వై.ఎస్.ఆర్ పాత్రలో కనిపించనున్నారు. రెండు సినిమాల మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఒకరోజు గ్యాప్ తో వస్తున్న ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.