
కన్నడ స్టార్ హీరో యశ్ లీడ్ రోల్ లో ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కె.జి.ఎఫ్ చాప్టర్ 1. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తంగం అనే మాఫియా డాన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా రిలీజ్ శుక్రవారం రిలీజ్ ఫిక్స్ చేయగా రిలీజ్ ముందు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వెంకటేష్ అనే దర్శకుడు తంగం బయోపిక్ గా తాను సినిమా చేయాలని అనుకున్నా అని కె.జి.ఎఫ్ మీద కేసు వేశాడు.
జనవరి 7 దాకా సినిమా రిలీజ్ ఆపాలని టెన్త్ మెట్రో పాలిటెన్ కోర్ట్ ఆదేశాలిచ్చింది. అయినా సరే కె.జి.ఎఫ్ టీం రిలీజ్ ను ఎవరు అడ్డుకోలేరని చెబుతున్నారు. కన్నడలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో సాయి కొర్రపాటి రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు ఒకరోజు ముందు కూడా యశ్ ఈ సినిమా రేపు రావడం పక్కా చూసి ఎంజాయ్ చేయడని ట్వీట్ చేశాడు. మరి రిలీజ్ ముందు ఈ రచ్చ దేనికోసమో అని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు.