
ఎన్.టి.ఆర్, కె.టి.ఆర్ ఇద్దరు ప్రేక్షకులకు తెలిసిన వారే. ఒకరేమో యంగ్ టైగర్ గా తన సినిమాలతో సత్తా చాటుతుంటే మరొకరేమో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా ప్రజల మనసులు గెలుస్తున్నారు. ఈ ఇద్దరు ఎవరి వారు తమ వృత్తికి న్యాయం చేస్తున్నారు. పేరు ఒకటైనా ఇద్దరి ఆలోచన విధానం వేరు. అయితే ఈ యంగ్ అచీవర్స్ ఇద్దరు ఒకచోట చూడాలన్నది అభిమానుల కోరిక.
అయితే అది ఎవరు అనుకున్నారో ఏమో కాని ఇదిగో ఇద్దరు తారక రాముళ్లు ఒకచోట ఇలా దర్శనమిచ్చారు. ఎన్.టి.ఆర్, కె.టి.ఆర్ మీటింగ్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త హాట్ న్యూస్ గా మారింది. అంతేకాదు ఇద్దరు కలిసి దిగిన ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తండ్రి హరికృష్ణ మరణం.. అంతిమయాత్ర ఇవన్ని తెలంగాణా ప్రభుత్వమే చేసింది. అందుకే జరిగిన ఎలక్షన్స్ లో టిడిపి తరపున అక్క సుహాసిని నిలబడినా సరే ఆమె తరపున ప్రచారం చేయలేదు ఎన్.టి.ఆర్.
ఇప్పుడు కె.టి.ఆర్, ఎన్.టి.ఆర్ కలిసి దిగిన ఈ పిక్ మాత్రం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇద్దరు కలిసి కొతసేపు టైం స్పెండ్ చేశారట. రాజకీయ, సిని పరిశ్రమల గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. సినిమా పరిశ్రమకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధమని కె.సి.ఆర్ చెబుతూనే ఉన్నారు. పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన మరిన్ని వసతులు ఏర్పాటుకి ఏర్పాట్లు చేస్తున్నారు.