
సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన మురుగదాస్ ఈమధ్య కొద్దిగా ఫాం తగ్గినట్టు కనిపిస్తున్నారు. మహేష్ తో స్పైడర్ ఫ్లాప్ అవగా ఈమధ్యనే విజయ్ తో తీసిన సర్కార్ సూపర్ హిట్ అయ్యింది. అయితే మురుగదాస్ లో ఇదవరకు ఉన్నంత కసి కనిపించడం లేదు అన్నది కోలీవుడ్ టాక్. ఇదిలాఉంటే క్రేజ్ ఉన్నప్పుడే వరుస సినిమాలు చేసేయాలని అనుకున్నాడేమో వరుసగా స్టార్స్ తో మురుగదాస్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.
పెట్ట రిలీజ్ తర్వాత రజినికాంత్ తో మురుగదాస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఆ తర్వాత అజిత్ తో 20 ఏళ్ల తర్వాత సినిమా ఫిక్స్ చేశారని అంటున్నారు. మురుగదాస్ మొదటి సినిమా హీరో అజిత్. దీన సినిమాతో మురుగదాస్ డైరక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. 2001లో మురుగదాస్ అజిత్ ల దీన రిలీజైంది. మళ్లీ 2020లో వారు కలిసి పనిచేస్తారని అంటున్నారు. ఇక అజిత్ తర్వాత మురుగదాస్ మళ్లీ విజయ్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. తుపాకి సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఈ ఇద్దరు ఉన్నారట. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా మురుగదాస్ తనకున్న క్రేజ్ తో ఈ కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నాడు. మరి స్కెచ్ అయితే అదిరింది కాని చేస్తున్న సినిమాలు మంచి ఫలితాన్ని ఇస్తే మంచిది లేదంటే ఇక కెరియర్ లో వెనుకపడినట్టే.