బ్రదర్స్ ఇద్దరు రెచ్చిపోతున్నారు..!

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో జనవరి 12న ఎఫ్-2 రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా నుండి ఈమధ్యనే ఓ టీజర్ రిలీజ్ కాగా లేటెస్ట్ గా సినిమాలోని మొదటి సాంగ్ రెచ్చిపోదామా బ్రదర్ అంటూ సాంగ్ రిలీజ్ చేశారు.

వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా ఈ సాంగ్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన ఈ సాంగ్ సినిమాపై క్రేజ్ మరింత పెంచింది. ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను నావించేందుకు వస్తున్నారు ఈ బ్రదర్స్. హ్యాట్రిక్ హిట్లు కొట్టిన అనీల్ రావిపుడి పోటీగా మరో రెండు పెద్ద సినిమాలు వస్తున్నా మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు.