
సూపర్ స్టార్ రజినికాంత్, కార్తిక్ సుబ్బరాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెట్ట. అసలేమాత్రం ఊహించని ఈ కాంబినేషన్ లో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రజిని సరసన ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష నటించడం జరిగింది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ సేతుపతి కూడా నటించడం విశేషం. కోలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా తెలుగులో రిలీజ్ డేట్ చెప్పలేదు.
ఈ సంక్రాంతికి తెలుగు సినిమాల సందడి బాగా ఉంది. చరణ్, బాలకృష్ణ, వెంకటేష్-వరుణ్ తేజ్ ల సినిమాలు వస్తున్నాయి. వినయ విధేయ రామ, ఎన్.టి.ఆర్, ఎఫ్-2 3 క్రేజీ సినిమాలు కావడం చేత మూడింటి మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో పెట్ట రైట్స్ సి.కళ్యాణ్ కొన్నారట. అయితే సంక్రాంతి రేసులో మాత్రం పెట్ట తెలుగు వర్షన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తుంది. 2.ఓ కూడా తెలుగులో భారీ రేటుకి కొన్నా ఇంకా బ్రేక్ ఈవెన్ కు చేరుకోలేదు.