
సూపర్ స్టార్ మహేష్ కు సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా క్రేజీ ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తున్నా మహేష్ అంటే బాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ వచ్చింది. అందుకే అక్కడ మేకర్స్ కూడా మహేష్ తో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. కాని మహేష్ మాత్రం అందుకు రెడీగా లేడు. ఎప్పుడు బాలీవుడ్ ఎంట్రీ గురించి అడిగినా నవ్వుతూ ఊరుకునే మహేష్ ఇప్పుడు బాలీవుడ్ వెళ్తారా అంటే అదో టైం వేస్ట్ అంటున్నాడు.
తెలుగులో సినిమాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని.. బాలీవుడ్ వెళ్లడమనేది టైం వేస్ట్ అనేశాడు మహేష్. మహేష్ అలా అనడంతో అందరు షాక్ అవుతున్నారు. సరైన సబ్జెక్ట్ వస్తే చేస్తా అనడం వేరు కాని అక్కడకి వెళ్లడం అసలు ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా మహేష్ చెప్పిన ఆన్సర్ బాలీవుడ్ జనాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మహేష్ బాలీవుడ్ ఎంట్రీ పై కాస్త కూస్తో హోప్స్ ఉన్నా అక్కడకు వెళ్లడం మహేష్ కు ఏమాత్రం ఇష్టం లేదన్న విషయం అర్ధమైంది.