మణికర్ణిక ట్రైలర్.. కంగనా విశ్వరూపం..!

ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా మధ్యలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేశాడు. టీజర్ తో అంచనాలు పెంచిన మణికర్ణిక రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ మరింత క్రేజ్ ఏర్పరచుకుంది. ఝాన్సీ లక్ష్మి భాయ్ వీరోచిత పోరాట పటిమను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 

కొద్దిగంటల క్రితం రిలీజైన మణికర్ణిక ట్రైలర్ చూస్తే సినిమా ఎంత గ్రాండియర్ గా తీశారో అర్ధమవుతుంది. మేకింగ్ అదరగొట్టగా సినిమా ఏమేరకు ప్రేక్షకులు మెప్పించేలా తీశారో తెలియాల్సి ఉంది. రౌద్ర రూపంతో కంగనా నటన హైలెట్ గా నిలిచేలా ఉందని చెప్పొచ్చు. 2019 జనవరి 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాలీవుడ్ లో మరో సంచలన సినిమా కాబోతుందని చెప్పడంలో సందేహం లేదు. 

జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ కార్డ్ లో క్రిష్ కు స్థానం ఉంచింది కంగనా. మరి మరోసారి బాహుబలి రేంజ్ లో భారీ స్థాయిలో వస్తున్న ఈ మణికర్ణిక ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.