
యువ హీరో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా పడి పడి లేచే మనసు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు. ఈమధ్య బన్ని టచ్ చేసిన సినిమాలన్ని హిట్ అవుతున్నాయి విజయ్ దేవరకొండకు రెండు సినిమాలు హిట్లు వచ్చాయి. అందుకే తన సినిమాను టచ్ చేసి వెళ్లమని శర్వానంద్ చెప్పాడట.
అడిగిన వెంటనే బిజీ షెడ్యూల్ లో ఉన్నా సరే బన్ని ఈ ఈవెంట్ కు వచ్చాడని అన్నాడు శర్వానంద్. సినిమా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందని.. ఈ సినిమాలో దర్శకుడు తన నుండి నటన బాగా రాబట్టాడని. ఇప్పటి నుండి హను నాకు గురు అని అన్నాడు శర్వానంద్. సాయి పల్లవి మీద వస్తున్న వార్తలన్నిటిని కొట్టిపడేశాడు శర్వానంద్. ఆమె మంచి నటి అని.. మంచి కో ఆర్టిస్ట్ అని ఆమెపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాడు శర్వా. ఇక ఈ శుక్రవారం నాడు వస్తున్న వరుణ్ తేజ్ సినిమా అంతరిక్షం కూడా హిట్ అవ్వాలని. రెండు సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు శర్వానంద్.