
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో చేస్తున్న సినిమా వినయ విధేయ రామ. 2019 సంక్రాంతి టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు వైజాగ్ లో అనుకున్నా అది కాస్త హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ కు షిఫ్ట్ అయ్యింది. ఈ నెల చివరన కాని లేదా జనవరి 3,4 తేదీలలో ఈ ఈవెంట్ జరుగనుందట. చెర్రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కె.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారట.
చరణ్ తో క్లోజ్ గా ఉండే కె.టి.ఆర్ ఈ ఈవెంట్ కు విశిష్ఠ అతిథిగా మారనున్నారట. అంతేకాదు మరో స్పెషల్ గెస్ట్ కూడా వినయ విధేయ రామ ఈవెంట్ కు వస్తున్నారని టాక్. అతనే ఎన్.టి.ఆర్. చరణ్, ఎన్.టి.ఆర్ ల స్నేహం గురించి అందరికి తెలిసిందే. ఆ చనువుతోనే చరణ్ రిక్వెస్ట్ కు తారక్ ఓకే చెప్పాడట. వినయ విధేయ రామ టీంను విష్ చేసేందుకు ఎన్.టి.ఆర్ కూడా వస్తున్నాడని తెలుస్తుంది. చరణ్, ఎన్.టి.ఆర్ వస్తేనే ఆ ఈవెంట్ కి అందం అనుకుంటుంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కె.టి.ఆర్ వారితో జాయిన్ అవడం మరింత కలర్ ఫుల్ కానుంది. మరి ఈ వేడుకకు వారు నిజంగా వస్తున్నారా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.