
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మొన్నామధ్య వచ్చిన మేకింగ్ వీడియోతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. 2019 సమ్మర్ రిలీజ్ అని అనుకున్నా అది ఇప్పుడు ఆగష్టు 15కి చేరిందట.
2019 స్వాతంత్ర దినోత్సవానికి సాహో రిలీజ్ కాబోతుంది. చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడమే తరువాయని తెలుస్తుంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ తో తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా సాహో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ, హింది భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సాహో రిలీజ్ ఫిక్స్ చేశాడు కాబట్టి ఇక అదే టైంకు రావాలని అనుకున్న చిరంజీవి సైరా సినిమా వేరే డేట్ వెతుక్కోవాల్సిందే. ముందు సాహో ఎనౌన్స్ చేశారు కాబట్టి వాళ్లు తప్పుకునే ఛాన్స్ లేదు. మరి చిరు సైరా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.