కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేస్తున్నాడు

పటాస్ తర్వాత అలాంటి హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. రీసెంట్ గా వచ్చిన ఎం.ఎల్.ఏ, నా.. నువ్వే సినిమాలు కూడా ఫ్లాప్ అవడంతో ఈసారి పకడ్బందీ ప్లాన్ తో దిగుతున్నాడని అనిపిస్తుంది. ప్రస్తుతం కెవి.గుహన్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్ ఆ సినిమా టైటిల్ గా 118 అని ఫిక్స్ చేశారు.     

టైటిలే వెరైటీగా ఉంది అనుకుంటుంటే సినిమా నుండి రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ కూడా ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. రీసెంట్ గా సినిమా టీజర్ డేట్ టైం రివీల్ చేస్తూ వదిలిన పోస్టర్ కూడా ఆకట్టుకుంది. రెగ్యులర్ సినిమాగా కాకుండా కళ్యాణ్ రామ్ ఈసారి సరికొత్త ప్రయోగం చేస్తున్నాడని అంటున్నారు. మహేష్ ఎస్ కోనేరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన షాలిని పాండే, నివేదా థామస్ నటిస్తున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్న ఈ సినిమా టీజర్ రేపు అనగా డిసెంబర్ 18 ఉదయం 10:30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారట. పోస్టర్స్ తో సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతున్న కళ్యాణ్ రాం టీజర్ తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.