
చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరోసారి తెర మీద కనువిందు చెయ్యడానికి అంతా సిద్దమైంది. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ కావాల్సిన విషయం ఏమిటంటే హీరోయిన్‌గా ఎవరిని నిర్ణయిస్తారని. దీనిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మాజీ హీరోయిన్, లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతిని… చిరు 150వ సినిమాలో నటించమని చిత్ర యూనిట్ కోరినట్లు తెలుస్తోంది.
చిరు 150వ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉందట. చిరంజీవితో పాటు దర్శకుడు వి.వి.వినాయక్ కూడా ఈ రోల్‌కు విజయశాంతి అయితే పర్‌ఫెక్ట్‌గా సూటవుతుందని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని ఆమెతో సంప్రదించి చెప్పారట. విజయశాంతి ఈ విషయంపై పాజిటివ్‌గా స్పందించినా ఇంతవరకు సినిమాకు సైన్ చేయలేదని సమాచారం. ఇక గతంలో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఎన్నో సినిమాలు హిట్స్‌గా నిలిచాయి. లేడీ అమితాబ్ ఇమేజ్ సంపాదించుకొని కొంతకాలం ఫిమేల్ లీడ్ క్యారెక్టర్లు చేసింది విజయశాంతి. ఒకవేళ చిరు 150 సినిమాలో చేసేందుకు ఆమె అంగీకరిస్తే 12 ఏళ్ల తర్వాత మళ్లీ విజయశాంతి స్క్రీన్‌పై కనిపించనుంది.