
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ మామిళ్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా కవచం. డిసెంబర్ 7 శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా సినిమాకు సంబందించి హీరోయిన్ కాజల్ ఇంటర్వ్యూ ఈరోజు ప్లాన్ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు కాజల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ప్రసాద్ ల్యాబ్ కు మీడియా ప్రతినిధులంతా ఇంటర్వ్యూ తీసుకునేందుకు వచ్చారు.
రెండు గంటలవుతున్నా కాజల్ రాకపోవడంతో ఎదురుచూసి విసుగుపోయిన మీడియా వాళ్లు కాజల్ 11:45కి రాగానే బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారట. మీడియా తీరుకి కాజల్ కూడా షాక్ అయ్యిందట. దాదాపు రెండు గంటల పాటు వెయిట్ చేయించినందుకు కాజల్ ను ఆశ్చర్యపరుస్తూ మీడియా వాళ్లు బాయ్ కాట్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కవచం సినిమాలో కాజల్, మెహ్రీన్ కౌర్ నటించారు.