
మహేష్, ఏసియన్ సునీల్ కలిసి నిర్మిస్తున్న ఏ.ఎం.బి సినిమాస్ డిసెంబర్ 2న ప్రారంభించనున్నారు. అసలైతే నవంబర్ 29న 2.ఓతో ఓపెన్ చేయాలని అనుకున్నారు. కాని కొన్ని పనులు పెండింగ్ ఉండటం వల్ల కుదరలేదు. డిసెంబర్ 2న ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమాలు ఉంటాయట. సాయంత్రం 4:30 నిమిషాలకు మొదటి ఆట మొదలుపెడతారట. రిలీజ్ కాకున్నా మొదట మహేష్ థియేటర్స్ లో 2.ఓనే ఆడనుంది.
హైదరాబాద్ కొండాపూర్, కొత్తగూడ జంక్షన్ లో ఈ మల్టీ ప్లెక్స్ నిర్మించారు. 7 స్క్రీన్స్ ఉన్న ఈ థియేటర్ లలో ఒకటి ప్రైవేట్ స్క్రీన్ అని తెలుస్తుంది. మిగతా 6 స్క్రీన్స్ లో 1600 సీటింగ్ కెపాసిటీ ఉంటుందట. అత్యాధునిక సాంకేతికతతో ఈ థియేటర్ నిర్మించడం జరిగింది. ఆడియెన్స్ కు మంచి థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుందని అంటున్నారు.