
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నాడు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేయగా ప్రభాస్ హీరోగా వస్తున్న సాహో కూడా ముందు సమ్మర్ రిలీజ్ అనుకున్నారు.
సుజిత్ డైరక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే కి రిలీజ్ ప్లాన్ చేశారు. దాదాపు సినిమా రిలీజ్ ఆరోజు ఫిక్స్ అంటున్నారు. అయితే సమ్మర్ అనుకున్న సైరా కూడా ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారట. స్వాతంత్ర సమరయోధుడి సినిమా కాబట్టి స్వాతంత్ర దినోత్సవం నాడు రిలీజ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నారట.
రెండు భారీ బడ్జెట్ సినిమాలే.. మరి ఈ రెండు సినిమాలు ఒకే రోజు వస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. చిరు కోసం ప్రభాస్ తన డేట్ మార్చుకునే అవకాశం ఉన్నా అది కుదుతురుందో లేదో చూడాలి.