
సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా సినిమా కబాలీ. ప్రపంచవ్యాప్తంగా కబాలీపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. కానీ ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదాలు పడింది. కానీ ఈసారి మాత్రం కబాలీ ఎంట్రీ ఫిక్సైంది. అందుకు గాను సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. బోర్డ్ నుండి U సర్టిఫికేట్ సొంతం చేసుకుంది కబాలీ. మొత్తం 152 నిమిషాలు చిత్రం ఉంటుంది. అంటే సుమారు రెండు గంటలు . ఎక్కడా సాగదీత లేకుండా మూవీ అంతా ఓ ప్యాక్ లా ఉండేలా ఉన్నట్టు సమాచారం.
ఇక కబాలీ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా అభిమానుల అంచనాలు అందుకునేలా మూవీ ఉందన్నది.. సెన్సార్ బోర్డ్ ఫస్ట్ రిపోర్ట్. తాజాగా సెన్సార్ ఫస్ట్ రిపోర్ట్ ప్రకారం .. రజినీ ఫెర్ఫామెన్స్ ఈ మూవీకి హైలెట్ అని చెబుతున్నారు. మూవీ మొత్తాన్ని రజినీ ఒక్కడే భుజం మీద వేసుకుని కథను నడిపించినట్టు సమాచారం. రెండు గంటల పాటు ఎక్కడా బోరు అనేది లేకుండా ఉందని తెలుస్తోంది. రజినీ యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోడం ఖాయమని అంటున్నారు. మొత్తం మీద ఫస్ట్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉండటంతో .. ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈనెల 22న కబాలీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.