పవన్ కళ్యాణ్ కళ గురించి ఏమన్నాడంటే..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం. పవర్ స్టార్ గా అందరికి తెలిసిన పవన్ కళ్యాణ్ లండన్ లో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ 6వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. మామూలుగా అయితే పవన్ బయటి ఫంక్షన్ లలో కనిపించడం చాలా తక్కువ. అలాంటిది యుకెలో  జరుగుతున్న ఓ కార్యక్రమానికి పవన్ వెళుతున్నాడు అనే వార్త, ఇటు సినిమా వర్గంలో, అటు రాజకీయ వర్గాల్లో, చర్చనీయాంశంగా మారింది. అక్కడికి వెళ్లిన పవన్ కు ఘన స్వాగతం లభించింది. అక్కడ పవన్ ఏం మాట్లాడారంటే.. 

కళ అనేది సంస్కృతిలో అంతర్భాగం, మన భాష, యాసని మర్చిపోకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు జాతి కళలను, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని కొనియాడారు. తన సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రోత్సహిస్తానని, తెలుగు ప్రాంతాల జానపద గీతాలు తన సినిమాల్లో ఉండేలా చూస్తానని పేర్కొన్నారు. తెలుగు సంప్రదాయాల్ని భావి తరాలకు పంచేందుకు ఈ తరహా ఉత్సవాలు ఎంతో సాయం చేస్తాయని అభిప్రాయపడ్డారు. సంస్కృతి, కళలను ఇప్పటి తరానికి తెలియజేయడంలో తల్లిదండ్రులు పాత్ర ఎంతో ముఖ్యమైనదని పవన్ అన్నారు.