
అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా సవ్యసాచి. మత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఎడమ చేయి తన ఆదీనంలో లేని హీరో తన కుటుంబానికి వచ్చిన కష్టం నుండి ఎలా బయటపడ్డాడు అన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తుంది.
సినిమాలో విలన్ గా కోలీవుడ్ హీరో మాధవన్ నటిస్తున్నాడని తెలిసిందే. ట్రైలర్ లో మాధవన్ క్యారక్టరైజేషన్ శాంపిల్ చూపించారు. చూస్తుంటే సవ్యసాచి సరికొత్త సంచలనాలతో రాబోతుందని చెప్పొచ్చు. నాగ చైతన్య చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. దీపావళి కానుకగా రిలీజ్ కాబోతున్న సవ్యసాచి సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందో లేదో చూడాలి.