రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్

తిత్లీ తుఫాను వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. బాధితులకు సహాయార్ధంగా సిని సెలబ్రిటీస్ తమ వంతుగా విరాళాలను ప్రకటిస్తున్నారు. అయితే యువ హీరో నిఖిల్ మాత్రం అక్కడకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నాడు అంతేనా 3 వేల మందికి భోజన సదుపాయం కల్పించాడని తెలుస్తుంది. అంతేకాదు 2500 కిలోల రైస్, 500 దుప్పట్లతో పాటుగా.. పవర్ కటింగ్ ఉంది కాబట్టి పోర్టబుల్ జెనరేటర్స్ ను అందించాడట.

నిఖిల్ చేసిన ఈ సహాయానికి అందరు ప్రశంసిస్తున్నారు. ఏదో డబ్బులు ఇచ్చాం చేతులు దులిపేసుకున్నాం అన్నట్టుగా కాకుండా బాధిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించడం గొప్ప విషయం. ఈ విషయంలో నిఖిల్ రీల్ హీరోగానే కాదు రియల్ హీరో అనిపించుకున్నాడు. శ్రీకాకుళానికి చెందిన సెలబ్రిటీస్ ఉన్నా వారు మాత్రం ఇంకా జరిగిన నష్టానికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు.