
సూపర్ స్టార్ మహేష్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మరోసారి ప్రూవ్ అయ్యింది. తెలుగు పరిశ్రమలో మహేష్ మరో క్రేజీ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ ఏకంగా 7 మిలియన్స్ కు చేరుకోవడం విశేషం. టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా మహేష్ సరికొత్త సంచలనం సృష్టించాడు. కోలీవుడ్ ధనుష్ 7.83 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉండగా మహేష్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
ఇక టాలీవుడ్ లో మాత్రం మహేష్ నెంబర్ 1 అని చెప్పొచ్చు. మహేష్ కు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. రజినికాంత్ 4.88 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉండగా.. పవన్ కళ్యాణ్ 3.29, అల్లు అర్జున్ 2.8, ఎన్.టి.ఆర్ 2.63 మిలియన్ ఫాలోవర్స్ ట్విట్టర్ లో కలిగి ఉన్నారు.
ఈమధ్య ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్న మహేష్ ఎలాంటి చిన్న విషయమైనా సరే ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. ఏప్రిల్ 2010లో ట్విట్టర్ జాయిన్ అయిన మహేష్ 7 మిలియన్ ఫాలోవర్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మహేష్ ఫాలోయింగ్ చూసి ఇతర భాషల హీరోలు కూడా షాక్ అవుతున్నారు.