పవన్ రాసిన లెటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాలు అంటే ఎంత ఇష్టమో.. సాహిత్యం అంటే కూడా అంతే ఇష్టం. అందుకే తన పార్టీ స్థాపించే టైంలో తిలక్, గుర్రం జాషువా లాంటి మహనీయులు చెప్పిన మాటలు గుర్తు చేశారు. నిత్యం ఏదో పుస్తకాన్ని నెమరవేసే పవన్, తాజాగా ఓ పుస్తకం గురించి రాసిన లెటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. పవన్ ఫ్రెండ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, మరో కవి కొడుకుకు ధ్యాంక్స్ చెబుతూ రాసిన లెటర్ చాలా స్పీడ్ గా షేర్ అవుతోంది. అందులో పవన్ ఓ పుస్తకాన్ని రీప్రింట్ చెయ్యనున్నట్లు వెల్లడించారు. 

గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన మహాగ్రంధం ఆధునిక మహాభారతం పుస్తకం గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెటర్ రూపంలో స్పందించారు. ఆ పుస్తకం గురించి త్రివిక్రమ్ ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ దాన్ని రీప్రింట్ చేసి అందరికి అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ వేశాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన ‘సాత్యకి’ , పరిచయం చేసిన మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ కు కృతఙ్ఞతలు తెలిపారు. 

పవన్ రాసిన లెటర్ లో ఏముందంటే..

‘‘ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు… కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు”, అన్న ‘మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసాయి. ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహావాక్యం’ అయింది. నీకు అత్యంత ప్రీతి పాత్రమయిన ‘ఆధునిక మహాభారతం’ అనే ఈ మహాగ్రంథాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపన పడే వారికోసం అందుబాటులో ఉండాలన్న నీ ఆకాంక్ష, ఈ మహాగ్రంథాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన ‘మహాకవి’ శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన ‘సాత్యకి’ గారికి నాకు ఈ ‘మహాకవిని’ పరిచయం చేసిన నా మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ గారికి నా కృతఙ్ఞతలు” అని చెప్పుకొచ్చారు.