
తన పదిహేను సినిమాల కెరీర్ లో ఏ ఒక్క హీరోయిన్ ని (సైడ్ హీరోయిన్ గా క్యాథెరిన్ థెరెసాని తప్ప) రిపీట్ చేయని అల్లు అర్జున్, శృతి హాసన్ కి మాత్రం రెండో సారి కూడా వెల్కమ్ బోర్డు పెట్టాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో తాను చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ఎన్నికైనట్లు సమాచారం. గతంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య అనే రెండు సినిమాల్లో శృతి నటించింది. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ అయితే, మరొకటి ఫ్లాప్.
మరి ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చే ఈ కొత్త సినిమా, హిట్ అవుతుందో, చెట్టుక్కుతుందో చూడాలి. రేసుగుర్రం లాంటి బంపర్ హిట్ తర్వాత, అల్లు అర్జున్- శృతి హాసన్ కాంబినేషన్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ క్రేజ్ ఈ కొత్త సినిమాకి కూడా ప్లస్ అవుతుందని అల్లువారి అభిమానుల అంచనా.