
బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ఆదివారం జరుగనుంది. ఫైనల్స్ లో ఐదుగురు కంటెస్టంట్స్ ఉండగా ఫైనల్ విన్నర్ ఒక్కడే అవుతాడు. నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఫైనల్స్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వస్తాడని తెలుస్తుంది. బిగ్ బాస్ విన్నర్ చీఫ్ గెస్ట్ వెంకీ చేతుల మీదగా టైటిల్ అందుకోనున్నాడు.
షో మీద మరింత ఆసక్తి పెంచేందుకు ఇంట్లోకి మొదటి వారం నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్ అందరిని సర్ ప్రైజ్ గా ఇంట్లోకి పంపించాడు బిగ్ బాస్. మొదట్లో కాస్త బోర్ కొట్టినా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 మొదటి సీజన్ కన్నా సూపర్ హిట్ అని చెప్పొచ్చు.
కౌశల్, గీతా మాధురి, దీప్తిలలో ఒకరు విజేత అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం దాదాపు కౌశల్ టైటిల్ విన్నర్ అని కన్ఫాం చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఆదివారంతో ముగుస్తుంది. మరి ఫైనల్ ఎపిసోడ్ లో ఎన్ని సర్ ప్రైజెస్ ఉంటాయో చూడాలి.