నాగార్జున ఏజ్.. వికీపీడియా తప్పు చెబుతుంది..!

దేవదాస్ సినిమాలో నాగార్జునతో పాటుగా నాని కూడా నటించాడు. మల్టీస్టారర్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ కలిగిస్తున్నాయి. అయితే సినిమాలో దేవాగా నటించిన నాగార్జున నానిని కనిపించకుండా చేశాడు. దాసుగా నాని మంచి నటన కనిపించినా నాని కన్నా నాగార్జున ఒక్కడే కనిపించాడని చెప్పొచ్చు. 


ఇక ఈ సినిమా చూసిన యువ హీరోలంతా నాగార్జున ఏజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్థావిస్తున్నారు. అందులో భాగంగా ఆరెక్స్ 100 హీరో కార్తికేయ నాగార్జున వయసు గురించి వికీపికీడియా తప్పు చెబుతుంది. ఆయనకు 59 సంవత్సరాలని చూపిస్తుంది.. ఆయన ఫిట్ నెస్ తో యంగ్ హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నాడని అన్నాడు కార్తికేయ. అంతేకాదు ఏమ్ ఉన్నాడ్రా బాబు అంటూ ట్వీట్ చేశాడు. ఒక్క కార్తికేయ మాత్రమే కాదు సినిమా చూసిన ఆడియెన్స్ కూడా నాగార్జున వయసు మర్చిపోయేలా చేసేలా యంగ్ అంద్ డైనమిక్ గా కనిపించి అలరించాడు కింగ్.