రష్మిక పెళ్లి క్యాన్సిల్ అయ్యినట్టేనా..!

కన్నడ కిరాక్ పిల్ల టాలీవుడ్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఆ సినిమాతో హిట్ అందుకోవడమే కాదు ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈ సినిమాతో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. ఛలో టైంలోనే కన్నడ నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టితో పెళ్లి కుదుర్చుకుంది రష్మిక.

అయితే తెలుగులో అమ్మడి ఫాలోయింగ్ చూసి ఈ టైంలో పెళ్లి కరెక్ట్ కాదనుకుంది అందుకే రక్షిత్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. అఫిషియల్ గా పెళ్లి వాయిదా అని చెబుతున్నా తెలుగులో అమ్మడి పాపులారిటీ చూశాక దాదాపు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టే అంటున్నారు. విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమాలో మళ్లీ జతకడుతున్న రష్మిక ఆ సినిమా కూడా హిట్ కొడితే మాత్రం ఈ జంట హిట్ పెయిర్ గా ముద్ర వేసుకున్నట్టే.