
నందమూరి కళ్యాణ్ రామ్, పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఇజం. కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ పూరి ఇజం టైటిల్ ను ఎనౌన్స్ చేసి.. ట్విట్టర్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు . మరోసారి పూరి మార్క్ స్టైల్ కనిపించింది. అందరూ అనుకున్నట్లు మామూలు టైటిల్ కాకుండా ఇజం అనే టైటిల్ తో పూరి జగన్నాధ్ అందరికి షాకిచ్చాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమా పై హైప్ క్రియేట్ చేశాడు.
ఇజం సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఆగస్ట్ 9 నుంచి నెలాఖరు వరకు స్పెయిన్‌లో భారీ షెడ్యూల్ జరుగుతుంది. సెప్టెంబర్ 29న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. తాను చేసిన అన్నిసినిమాలు ఒక ఎత్తయితే, పూరితో చేస్తున్న ఇజం ఓ ఎత్తు అని కళ్యాణ్ రామ్ అన్నారు. జర్నలిస్ట్ గా కళ్యాణ్ రామ్ పవర్ ప్యాక్ యాక్టింగ్ తో అదరగొడతాడు అని పూరి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.