
ఎస్ జె సూర్య ని తప్పించి, డాలీ ని రప్పించుకున్న పవన్ కళ్యాణ్, తన కొత్త సినిమా పై విపరీతమైన డైలమా లో ఉన్నడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ లో మార్పులు చాలా చేయాలని, దానికి కొంత సమయం కావాలని డాలి కోరాడని, కాబట్టి పవన్ ఈ లోపు త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టబోతున్నాడని రకరకాల వార్తలు వచ్చాయి.
అయితే అవన్నింటికీ సమాధానంగా చిత్ర నిర్మాత, శరత్ మరార్ ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్ పక్కాగా రెడీ అయిందని, ఇక పైన ఎటువంటి ఆలస్యం లేకుండా షూటింగ్ తొందరలోనే మొదలు పెడతామని తెలిపాడు. ఈ నెలాఖరులోనే మొదటి షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. దీనితో డాలి సినిమా తర్వాతే త్రివిక్రమ్ సినిమా ఉంటుందని పవన్ ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చింది, ఖుషి మొదలైంది. హీరోయిన్ తో పాటు మొదటి షెడ్యూల్ తో కీలక తారాగణం పాల్గొంటారాని సమాచారం. వాళ్ళందరి డేట్లు కన్ఫర్మ్ చేసుకొని షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.