
బుధవారం ఎన్.టి.ఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించిన వార్త తెలిసిందే. ఈ దుర్ఘటన ఎన్.టి.ఆర్ ను కలచి వేసింది. ఈ పరిస్థితుల్లో ఎన్.టి.ఆర్ షూటింగ్ కు పాల్గొనడం కష్టమని అనుకున్నారు. కాని తన వల్ల నిర్మాతకు నష్టం వాటిల్లకూడదని భావించిన ఎన్.టి.ఆర్ అరవింద సమేత షూటింగ్ కు రెడీ అని చెప్పాడట. రెండు రోజుల తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పాడట.
త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దసరా బరిలో దిగాలని ముందే ఫిక్స్ అవడంతో షూటింగ్ స్పీడ్ గా చేస్తున్నారు. అయితే తండ్రి మరణంలో బాధల్లో ఉన్న ఎన్.టి.ఆర్ షూటింగ్ కు కాస్త టైం తీసుకుంటాడని అనుకున్నారు కాని నిర్మాత కష్టం గుర్తించిన తారక్ వెంటనే సినిమా షూటింగ్ కు సిద్ధమవుతున్నాడు. ఈ విషయం తెలిసి తన సినిమా డెడికేషన్ కు తారక్ నువ్వు సూపరంతే అంటున్నారు.