ప్రముఖ దర్శకురాలు బి.జయ కన్నుమూత..!

తెలుగు సిని పరిశ్రమలో మరో దర్శకురాలు మృతి అందరిని షాక్ అయ్యేలా చేసింది. హరికృష్ణ మరణాన్నే జీర్ణించుకోలేకపోతున్న పరిశ్రమకు ప్రముఖ దర్శకురాలు బి.జయ మరణం షాక్ ఇచ్చింది. పి.ఆర్వో బిఏ రాజు సతీమణి అయిన బి.జయ జర్నలిస్ట్ గా కెరియర్ ప్రారంభించి చంటిగాడు సినిమాతో దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టుకున్నారు. 


లాస్ట్ ఇయర్ వచ్చిన వైశాఖం సినిమా ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుండెపోటుతో ఆమె మరణించినట్టు సమాచారం. మహిళా దర్శకురాలిగా ప్రతిభ చాటిన బి.జయ ఇంత త్వరగా అందరిని విడిచి వెళ్తారని ఎవరు ఊహించలేదు. ఆమె మరణం సినిమా పరిశ్రమను కలచి వేసేలా చేసింది. సిని ప్రముఖులు ఆమె మరణ వార్త విని దిగ్బ్రాంతికి గురయ్యారు.