ఆ హీరోకి స్క్రీన్ నేమ్ పెట్టేస్తున్నారట..!

హీరోలకు స్టార్ స్టేటస్ వస్తే దానికి సింబాలిక్ గా స్క్రీన్ నేమ్ పెట్టేస్తారు. ఈమధ్య యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవే స్టార్ స్టేటస్ ఇచ్చేశాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఈ మూడు సినిమాలతోనే విజయ్ రేంజ్ ఏంటో తెలిసిపోయింది. లేటెస్ట్ గా వచ్చిన గీతా గోవిందం సినిమా స్టార్ సినిమాలతో సమానంగా వసూళ్లను రాబడుతుంది.  

ఐదు రోజుల్లో 54 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన గీతా గోవిందం 40 నుండి 50 కోట్ల షేర్ వసూళ్లు చేసేలా ఉంది. ఇక ఈ సినిమాతో స్టార్ గా తన రేంజ్ చూపించిన విజయ్ కు స్క్రీన్ నేమ్ పెట్టేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా మెగాస్టార్, సూపర్ స్టార్ అంటూ ట్యాగ్ లైన్ పెడుతుండగా విజయ్ కోసం ఓ క్రేజీ స్క్రీన్ నేమ్ వెతుకుతున్నారు. ఇప్పటికే అభిమానులను రౌడీస్ అంటూ సంభోదించే విజయ్ ను రౌడీ స్టార్ గా కొందరు పిలుస్తున్నారు. మరి ఈ స్టార్ హీరోకి ఎలాంటి స్క్రీన్ నేమ్ తో వస్తాడో చూడాలి.