టాలీవుడ్ లో మరో స్టార్ విజయ్ : చిరంజీవి

దశాబ్ధ కాలంగా యువ హీరోలు ఒక హిట్టు రెండు ఫ్లాపులతో కెరియర్ కొనసాగిస్తుండగా మూడంటే మూడు హిట్లతో స్టార్ క్రేజ్ దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా అతనికి యూత్ లో మంచి క్రేజ్ పాపులారిటీ తీసుకురాగా ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం మాత్రం అతని రేంజ్ మార్చేసింది. ఐదు రోజుల్లో 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి స్టార్ హీరోల గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

గీతా గోవిందం సక్సెస్ అయిన సందర్భంగా ఆదివారం సక్సెస్ మీట్ జరిపారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం రెండు సినిమాల్లో విజయ్ నటన నచ్చిందని చెప్పిన చిరు తన కెరియర్ లో విజేత ఎలాగో ఈ సినిమా విజయ్ కు అలా అన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే లీక్ అవడం పట్ల సిని పరిశ్రమ పెద్దగా టెక్నికల్ డిపార్టెంట్ మాత్రమే కాదు అందరికి వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి.

పవన్ అత్తారింటికి దారేది సినిమా కూడా ఇలానే ముందు లీకైనా సూపర్ హిట్ అయ్యిందని అలానే ఈ సినిమా సూపర్ హిట్ అవడం మంచి విషయమని అన్నారు. ఇక సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్, ఆర్టిసులను అందరిని పేరు పేరున ప్రస్థావించి సినిమా సక్సెస్ శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ఇక ఈ సినిమా సక్సెస్ తో విజయ్ స్టార్ స్టేటస్ సంపాదించాడని చెప్పడం అతని ఫ్యాన్స్ ను అలరించింది.