విజయ్ సక్సెస్ జోష్ లో మెగాస్టార్..!

విజయ్ దేవరకొండ లేటెస్ట్ సెన్సేషన్ గీతా గోవిందం 3 రోజుల్లోనే 37 కోట్లతో సంచలనం సృష్టిస్తుంది. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు. ఆగష్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమా మరోసారి విజయ్ స్టామినా ఏంటో చూపిస్తుంది.

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ రేపు అనగా ఆగష్టు 19 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుపనున్నారట. ఈ సక్సెస్ మీట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తారని తెలుస్తుంది. విజయ్ సక్సెస్ జోష్ లో మెగాస్టార్ పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా చూసిన చిరంజీవి సినిమాను బాగా ఎంజాయ్ చేశారట. మరి సక్సెస్ మీట్ లో విజయ్ గురించి చిరు ఏం మాట్లాడతారో అని అటు మెగా ఫ్యాన్స్ తో పాటుగా విజయ్ ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు.