నాని జెర్సీ.. ప్రయోగమే..!

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం కింగ్ నాగార్జునతో దేవదాస్ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాని గౌతం డైరక్షన్ లో జెర్సీ సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే మొదలైన ఈ సినిమాలో నాని మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడట. అందులో ఒకటి టీనేజ్, మరోటి మిడిల్ ఏజ్ కాగా 40 ఏళ్ల వయసు గల వాడిగా కూడా నటిస్తున్నాడట.

క్రికెట్ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో నాని క్రికెట్ కోసం కెరియర్ నాశనం చేసుకున్న కుర్రాడి కథతో వస్తుందట. ఈ సినిమాతో నాని ప్రయోగం చేస్తున్నాడని తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని కృష్ణార్జున యుద్ధంతో నిరాశపరచాడు. దేవదాస్ లో డాక్టర్ గా అలరించడానికి వస్తున్న నాని జెర్సీలో మాత్రం క్రికెటర్ గా అదరగొడతాడట. మరి నాని చేస్తున్న ఈ ఎక్స్ పెరిమెంట్ ఎలా ఉండబోతుందో చూడాలి.