
రాజమౌళి చేయబోతున్న ఎన్.టి.ఆర్, చరణ్ మల్టీస్టారర్ సినిమా అక్టోబర్ నుండి మొదలవనున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. పిరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ కూడా ఉంటాడని ఎక్స్ క్లూజివ్ టాక్. రాజమౌళి ఈ మల్టీస్టారర్ లో మహేష్ ను కూడా తీసుకుంటున్నాడట.
మహేష్, చరణ్, ఎన్.టి.ఆర్ ముగ్గురు స్క్రీన్ పై కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. అయితే మహేష్ కేవలం ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట. ట్రిపుల్ ఆర్లో మహేష్ సర్ ప్రైజ్ ఎంట్రీ స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరిని ఖుషి చేస్తుంది. మహేష్ వాయిస్ తో మెగా నందమూరి మల్టీస్టారర్ రాబోతుంది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది.